పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’లో మరో హీరో.. ఎవరో తెలిస్తే షాక్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్​గా.. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఓజీ. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్​ రోల్​లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. ఈ సినిమాలో మరో సీనియర్ నటుడు భాగస్వామమైనట్లు తెలుస్తోంది. ఆయనెవరో కాదు. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవితి కలిసి నటించిన వెంకట్. అదేనండి.. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’, ‘శివరామరాజు’ సినిమాల్లో కనిపించిన వెంకట్.

తాను ‘ఓజీ’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వెంకట్. తన పాత్ర షూటింగ్ కూడా అయిపోయిందని చెప్పాడు. అయితే తన పాత్రమేటి మాత్రం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. ఇక ఈ మూవీలో తమిళ నటులు అర్జున్‌ దాస్‌, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్‌ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ అర్జున్‌ దాస్‌ వాయిస్‌ ఓవర్‌తో కూడిన గ్లింప్స్‌ కొద్ది రోజుల క్రితం విడుదలైంది. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news