ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. నేషనల్​ అవార్డు గ్రహీత కూడా

-

ఈ కింది ఫొటోలో ఉన్న చిన్నారి ప్రస్తుతం నటి మాత్రమే కాదు ప్లేబ్యాక్ సింగర్, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఆమె నటన, అందానికి దక్షిణాది ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. కాకపోతే ఇప్పటివరకు తెలుగులో నేరుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇటీవలే ఆమెకు ఓ సినిమాకుగానూ ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎవరో గుర్తుపట్టారా…

ఎవరో కాదు నటి అపర్ణ బాలమురళి. కేరళకు చెందిన ఈ అమ్మడు.. త్రిసూర్​లో పుట్టి పెరిగింది. నటి కాకముందు సింగర్, డ్యాన్సర్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించింది. ‘ఒరు సెకండ్ క్లాస్ యాత్ర’ సినిమాతో వెంటితెర అరంగేట్రం చేసింది. అలా మలయాళంతో పాటు తమిళంలోనూ నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.

‘సర్వం తాళమయం’ అనే డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్​ను పలకరించింది. ఇక లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దురా!’ ఈ సినిమాతో నటనకు మంచి ప్రశంసలు అందుకుంది అపర్ణ. అంతేకాదు.. సంప్రదాయ చీరకట్టులో అచ్చం తెనుగింటి అమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఈ సినిమాలోని ఆమె పాత్రరకు సౌత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు మనసుల్లో స్థానం సంపాదించింది. ఇందులో ఆమె తన నటనతో ఎంతో మంది కుర్రాళ్లను ఫిదా చేసింది. ఎంతలా అంటే.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే అనుకునేంతగా… ఈ సినిమాకే ఆమెకు ఉత్తమనటిగా జాతీయ అవార్డు కూడా వరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు.. ఇని ఉతరమ్​, నితమ్​ ఓరు వానమ్​, ఆకాశం, ఉల, పద్మని, కాపా సహా పలు చిత్రాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version