తిరుమలలో కొత్త గెటప్ లో కనిపించిన నటి హేమ..!

-

టాలీవుడ్‌ సినీనటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఆమె ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మొదట తనకు ఎలాంటి సంబంధం లేదని వీడియోలతో బుకాయించినా.. రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆధారాలను బయటపెట్టారు. డ్రగ్స్‌ కేసులో ఆమెను విచారించిన పోలీసులు తరువాత అరెస్ట్ చేశారు. అనంతరం నటి హేమ బెయిల్‌పై బయటకు వచ్చింది.

తాజాగా సినీనటి హేమ నాడు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుంది. అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన హేమ దర్శనం బాగానే జరిగిందన్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు రేవ్‌ పార్టీపై ప్రశ్నించగా.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి.. అనేక కథనాలు రాశారు కదా అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అరెస్ట్ తరువాత హేమ మొదటిసారి కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అరెస్ట్ తరువాత హేమకి భక్తి ఎక్కువ అయిందంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news