బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెయిల్

-

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు స్థానిక కోర్టు బుధవారం రోజున బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

గత నెలలో బెంగళూరులో ఓ రేవ్ పార్టీ జరిగింది. దానిపై పోలీసులు దాడులు నిర్వహించగా అందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు రాగా ఆమె బెంగళూరులో లేనని తన ఫామౌస్​లో ఉన్నానని ఫేక్ వీడియో పెట్టారు. ఈ క్రమంలో తప్పు దారి పట్టించేలా చేశారన్న ఆరోపణలతో ఇటీవల ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news