జాన్వీ కపూర్ గ్లామర్ షో.. నెట్టింట అందాల విస్ఫోటనం

-

జాన్వీ కపూర్.. ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ తన అందంతో కుర్రాళ్ల మనసు మైమరిపిస్తోంది. ఈ బ్యూటీ ఫ్యాషన్ ట్రెండ్కు అబ్బాయిలే కాదు అమ్మాయిలూ ఫిదా అవుతున్నారు. ఇక ఇటీవల అనంత్- రాధికల వివాహ వేడుకలో జాన్వీ ధరించిన ఔట్ఫిట్స్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చంతా. ఈ బ్యూటీ డిజైనర్ ఎవరో కానీ అదిరిపోయే ఔట్ఫిట్స్ డిజైన్ చేస్తున్నారంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

ఇక జాన్వీ తాజాగా ఈ ఈవెంట్ కోసం సిల్వర్ కలర్ షైనింగ్ ఔట్ఫిట్లో కనిపించింది. ఈ డ్రెస్సుతో పాటు జాన్వీ కూడా మెరిసిపోతోంది. ఈ ఔట్ఫిట్లో ఈ భామ తన అందాల విందుతో అదరగొట్టింది.

ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. జాన్వీ.. ఇండియన్ కర్దాషియన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కిమ్ కర్దాషియన్కు స్ట్రాంగ్ కాంపిటీషన్ అంటూ ఈ భామ అందాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.

 

మొత్తానికి ప్రస్తుతం నెట్టింట చర్చంతా జాన్వీ కపూర్ గురించే. ఇక ఈ బ్యూటీ సినిమాల ఛాయిస్ కూడా మిగతా స్టార్ కిడ్స్తో పోలిస్తే చాలా చాలా బెటర్గా ఉంటుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం జాన్వీ ఓవైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్లో బిజీబీజిగా గడుపుతోంది. టాలీవుడ్లో ఈ భామ దేవరలో ఎన్టీఆర్తో జత కడుతోంది. ఇదే కాకుండా రామ్ చరణ్తో ఓ సినిమా కన్ఫామ్ అయింది. తాజాగా నానితో కూడా ఓ సినిమా ఓకే చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version