వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. అంతేకాకుండా ఆమె ఆనవాళ్లు లేకుండా చేసేందుకు దుండగులు కిరాతక చర్యకు పాల్పడ్డారు. ముఖాన్ని గుర్తుపట్టకుండా కాల్చినట్లు సమాచారం.
ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. మారేపల్లి మార్గంలోని పెద్ద కాల్వలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. మహిళ ముఖంపై కాలిన గాయాలు ఉండటంతో ఆమె ఎవరో గుర్తించడం కష్టంగా మారింది. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.