అమీన్ పూర్ ముగ్గురు చిన్నారులు మరణించిన కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. గత నెల 27వ తేదీన… పెరుగన్నం తిన్న ముగ్గురు చిన్నారులు మరణించగా… తల్లికి తీవ్ర అస్వస్థత నెలకొంది. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో.. తల్లి అక్రమ సంబంధం కారణంగానే ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు పోలీసులు తేల్చేశారు.
ఇటీవల పదవ తరగతి గెట్ టుగెదర్ పార్టీ జరిగిందట. ఈ వేడుకల్లో ముగ్గురు పిల్లల తల్లి రజిత… తన పదవ తరగతి స్నేహితుడితో కలవడం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం వాళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకొని కలిసి జీవించాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు పోలీసులు. ఈ తరుణంలోనే భర్త చెన్నయ్య, ముగ్గురు పిల్లలను చంపాలని విషం కలిపిన ఆహారం.. వాళ్లకు తల్లి రజిత పెట్టిందట.
అయితే పెరుగన్నం తినే సమయానికి.. చెన్నయ్య పని పైన బయటకు వెళ్ళాడు. కానీ చిన్నారులు ముగ్గురు ఆహారం తిని చనిపోయారు. తన గురించి బయటపడుతుందని ఆమె కూడా కాస్త తినడంతో కడుపునొప్పికి గురి అయింది రజిత. ఇక ఈ సంఘటనపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.