రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది రిలయన్స్ కంపెనీ. ఈ తరుణంలోనే ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం దివాకరపల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన ఉంది. ఈ తరుణంలోనే టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు మంత్రి నారా లోకేష్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. రిలయన్స్ ప్రతినిధులతో కలిసి సీబీజీ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్… ఈ మేరకు పనులు ప్రారంభించింది.
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం దివాకరపల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన
పెద్దఎత్తున స్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు
పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్… pic.twitter.com/Gh20mrtpOX
— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2025