టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి గురించి తెలియని వారుండరు. తల్లి, అత్త పాత్రల్లో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా. సాధారణంగా సినిమాల్లో చాలా సాఫ్ట్‌గా కనిపించే ప్రగతి రియల్ లైఫ్‌లో మాత్రం సూపర్ ఎనర్జిటిక్. ఇక సోషల్ మీడియాలో ఈమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా జిమ్‌లో ఈ బ్యూటీ చేసే కసరత్తులు చాలా పాపులర్. అయితే కేవలం జిమ్‌లో కసరత్తులు చేసి కండలు పెంచడమే కాదు.. ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇదేదో హాబీ కోసమో.. ఫిట్ బాడీ కోసమో కాదు. ఏకంగా ఈ బ్యూటీ జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతోంది.
అయితే తాజాగా ప్రగతి నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. ఈ పోటీల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన 28వ పురుషులు, మహిళల నేషనల్ లెవెల్ ‘బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో పాల్గొన్న ప్రగతి.. మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రగతి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్టు చేసింది. ‘నా జీవితం చెడు నిర్ణయాలు, హార్ట్ బ్రేక్స్, డెడ్ ఎండ్స్తో నిండి ఉంది. కానీ, ఇలాంటివి కూడా నాకు ఉత్సాహాన్నిస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడాలన్నది జీవితానికి విజయ మంత్రం’ అని రాసుకొచ్చింది.
View this post on Instagram