అక్కడ ఏర్పడిన ప్రభుత్వం గత సర్కార్ ప్రవేశపెట్టిన ధూమపాన నిషేధాన్ని రద్దు చేసింది. పన్నుల రాయితీల ద్వారా కోల్పోయిన ఆదాయన్ని తిరిగి పొందటం కోసం ఈ నిర్ణయం తీసుకుందట. ఈ నిర్ణయాన్ని ప్రజా ఆరోగ్య సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పొగాకు వ్యతిరేక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకీ ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఏదో తెలుసా..?
న్యూజిలాండ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశంలో దుమారం రేపుతోంది. గతంలో న్యూజిలాండ్‌ను పొగాకు రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో అప్పటి ప్రధాని.. జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ పేరుతో 2009 తర్వాత జన్మించిన వారికి సిరగెట్ల అమ్మకాన్ని నిషేధిస్తూ చట్టాన్ని తీసుకురాగా.. ప్రస్తుత ప్రభుత్వం ధూమపాన నిషేధాన్ని రద్దు చేసింది. సోమవారం రోజున న్యూజిలాండ్ 42వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన క్రిస్టోఫర్ లుక్సన్.. పొగాకు ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తూ .. ధూమపాన విక్రయాలు యథావిధిగా కొనసాగించాలని సూచించారు.
పొగాకు ఉత్పత్తులపై నిషేధం వల్ల దేశంలో బ్లాక్ మార్కెట్ విస్తరించే ప్రమాదం ఉందని క్రిస్టోఫర్ లుక్సన్ అన్నారు. దేశ వ్యాప్తంగా ధూమపానం చేసే వారి సంఖ్య తగ్గడంతో.. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం తొలగించినా నష్టం లేదని తెలిపారు. అవసరమైతే వాటి వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.