ఇండియన్ గ్లోబల్ ఫోరమ్ అవార్డు వేడుకల్లో నటి సోనమ్ కపూర్ ..!

-

భారతదేశం UK యొక్క సూపర్ పవర్స్ ని ఇంకా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని నటి సోనమ్ కపూర్ అన్నారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్ నెహ్రూ సెంటర్ బ్రిటీష్ కౌన్సిల్‌తో రోడ్‌మ్యాప్ 2030 కీ పిల్లర్‌ను స్పాట్‌లైట్ చేస్తుంది. సృజనాత్మక పరిశ్రమల సహకారాన్ని పెంచడం మంచిది అన్నారు.ఆర్థిక మరియు చారిత్రక సంబంధాలకు మించిన సంబంధం ఇది అన్నారు ఆమె. క్రియేటివ్ గా కలిసి పని చేస్తే మంచిదన్నారు. అలానే విండ్సర్‌లో ఇండియా గ్లోబల్ ఫోరమ్ 5వ వార్షిక UK-ఇండియా అవార్డులని అందజేశారు. దీనిలో శేఖర్ కపూర్ UK-ఇండియా రిలేషన్స్ అవార్డుకు జీవితకాల సహకారం ఇచ్చారు. అవార్డుని అందుకున్నారు. UK-ఇండియా అవార్డ్స్‌ లో గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్‌ను మేరీ కోమ్ అందుకున్నారు.

విండ్సర్‌లో ఇండియా గ్లోబల్ ఫోరమ్ 5వ వార్షిక UK-ఇండియా అవార్డులు UK-భారత్ భాగస్వామ్యాన్ని నడిపేందుకు కొంత మంది వ్యక్తులు, సంస్థలను గౌరవించే అవార్డులు అందించారు. జూన్ 29, 2023 న స్పోర్టింగ్ లెజెండ్, మొట్టమొదటి బాక్సింగ్ ఒలింపిక్ పతాక విజేత మేరీ కోమ్‌ కి 5వ వార్షిక UK-ఇండియా అవార్డ్స్‌లో ‘గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వచ్చింది. ఈ సాయంత్రం ఇలా పాల్గొనడం నా అదృష్టం అన్నారు. అలానే ఇది పెద్ద గౌరవం అని కూడా ఆమె అన్నారు. 20 సంవత్సరాలుగా పోరాడుతున్నాను బాక్సింగ్ కోసం అని అన్నారు. దేశం కోసం, నా కుటుంబం కోసం నేను ఎంతో త్యాగం చేశానన్నారు ఆమె. బ్రిటన్‌లోని ప్రముఖ హాస్యనటుడు ఇంప్రెషనిస్ట్ రోరే బ్రెమ్‌నర్ కూడా పాల్గొన్నారు.

అలానే సోనమ్ లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన ఈ సమ్మిట్ లో కళ, సంస్కృతి, ఫ్యాషన్, సినిమా ప్రపంచంలోని వారందరినీ ఒకచోట చేర్చింది అన్నారు. బాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని ఆమె చెబుతూ మార్పులు కచ్చితంగా వచ్చాయని అన్నారు. ప్రేక్షకులు కూడా మారుతున్నారు ప్రేక్షకులు మారుతుండడంతో సినిమాల్లో కూడా మార్పులు వస్తున్నాయి.

పాత్రలో కూడా మార్పులు వస్తున్నాయని సోనమ్ చెప్పారు. ఎంతో మార్పు రోజురోజుకీ వస్తుందని అయితే అక్కడ బాలీవుడ్ లో ఎక్కువ మార్పులు వచ్చాయి కానీ ఇక్కడ పెద్దగా మార్పులు నాకు ఏమీ కనపడటం లేదు అని ఆమె చెప్పారు. ఫ్యాషన్ డిజైనర్ అనిత డోంగ్రే గ్రామీణ మహిళా హస్త కళాకారులని ప్రోత్సహించాలని అన్నారు.

భారతదేశానికి అభివృద్ధి స్త్రీల ద్వారా వస్తుందన్నారు భారతదేశంలో మహిళలు సాధికారత సాధించాలి అన్నారు. ఓ 40 ఏళ్ల తర్వాత అయినా కూడా ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువ మార్పు తీసుకురావాలని ఆమె అన్నారు మహిళ శక్తివంతంగా ఉండాలంటే ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. గ్రామంలో ఒక మహిళకి సాధికారత కల్పించాలని నేను నమ్ముతున్నానని ఆమె గట్టిగా చెప్పారు. ఒకవేళ కనుక ఒక మహిళ సాధికారత పొందితే ఆమె కూతురు మెరుగైన విద్యని పొందుతుంది కుటుంబం కూడా బాగుంటుంది గ్రామంలో గౌరవం కూడా ఆమెకి వస్తుంది అన్నారు.

ఆ తర్వాత ఇండియా గ్లోబల్ ఫారం వ్యవస్థాపకుడు చైర్మన్ మన కల్చర్ గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అమిష్ త్రిపాఠి డైరెక్టర్ నెహ్రూ సెంటర్ లండన్ ఎంత ఎక్కువ పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేస్తే అంత ఉపయోగం ఉంటుందని చెప్పారు లోకల్ క్రాఫ్ట్స్ ని ప్రోత్సహించడం వంటివి చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version