Actress Varsha Bollamma : తన పెళ్లిపై క్యూట్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తెలుగు, తమిళం, మలయాళం సినీ పరిశ్రమలో రాణిస్తోంది వర్ష.’మిడిల్ క్లాస్ మెలోడిస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.2019లో ‘చూసి చూడంగానే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే..తాజాగా తన పెళ్లిపై క్యూట్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తనకు ముందు నుంచి తల్లిదండ్రుల సపోర్ట్ ఉందని చెప్పారు. తాను ఏం చేసినా సూపర్ అని పొగుడుతారని అన్నారు. ఏదైనా పెళ్లి సీన్ లో నటిస్తే అమ్మ ఏడుస్తుందని…. అయితే అది నిజం కాదని ఓదారుస్తానన్నారు. తనకు మరో మూడునాలుగేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదని చెప్పారు. వర్ష నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం వచ్చే నెల 9న థియేటర్లలో విడుదల కానుంది.