టీ, కాఫీలు తాగడం ఈరోజుల్లో అందరికి నిత్యవసరం అయిపోయింది.. ఉదయం లేస్తూనే కాసింత కాఫీ గొంతులో పోసుకుంటే కానీ.. మనసుకు హాయిగా ఉండదాయే.. అయితే చాలామంది.. టీ లేదా కాఫీ తాగేముందు కొంచెమైనా వాటర్ తాగుతుంటారు. మనకు వాటర్ తాగాలని అనిపించకున్నా.. టీ లేదా కాఫీ రాగానే వాటర్ కూడా ముందు తాగేస్తాం..ఇలా ఎందుకు చేస్తున్నామో కూడా మనకు తెలియదు.. మరి ఇలా టీ/ కాఫీ తాగేముందు వాటర్ తాగడం మంచిదేనా..? వైద్యులు ఏ అంటున్నారు..?

టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్) స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకని వాటిని తాగేముందు నీటిని తాగితే నోట్లో యాసిడ్ ప్రభావం పడకుండా ఉంటుంది. కనుక టీ, కాఫీ తాగేముందు కచ్చితంగా నీటిని తాగాలని వైద్యులు అంటున్నారు.
టీ, కాఫీలలో టానిన్ అనబడే సమ్మేళనం ఉంటుందట. ఇది దంతాల రంగును మారుస్తుంది. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే.. టీ, కాఫీలను తాగేముందు నీటిని తాగాల్సిందే..
టీ, కాఫీలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి.. అవి జీర్ణాశయంలో అల్సర్లను కలగజేస్తాయి. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే.. టీ, కాఫీలు తాగేముందు నీటిని తీసుకోవాలి. దీంతో అవి జీర్ణాశయంలోకి వెళ్లినా.. నీటితో కలుస్తాయి కనుక పెద్దగా ప్రభావం పడదనమాట…
టీ, కాఫీలను తాగడం వల్ల సహజంగానే మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. కనుక దాన్ని నివారించేందుకు టీ, కాఫీలకు ముందు నీటిని తాగడం ఉత్తమం..
నీటిని తాగకుండా టీ, కాఫీలను నేరుగా తాగితే దీర్ఘకాలంలో జీర్ణాశయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.. అవి రాకుండా ఉండాలంటే.. టీ, కాఫీలను తాగేముందు నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో ఆయా సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.. అసలు టీ, కాఫీలు తాగడమే ఒక చెడ్డ అలవాటు.. మళ్లీ అలవాటు ఇంకా చెడ్డగా చేయకుండా.. కాసింత నీళ్లు ముందు గొంతులో పోసుకుంటే.. నష్టం కాసింతైనా తగ్గుతుంది..
చాలామంది ఇన్ని రోజులు వాళ్లకు తెలియకుండా టీ, కాఫీలు తాగేముందు వాటర్ తాగడం అలవాటుగా చేసుకున్నారు.. ఒకవేళ మీకు ఈ అలవాటు లేకుండా.. మీరు కూడా టీ, కాఫీలు తాగేముందు వాటర్ తాగేయండి.
