గ్లూటెన్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. గ్లూటెన్ ఉన్న ఆహారం తినకూడదని మాత్రం చెప్తుంటారు.. గ్లూటెన్ లేని ఆహారం అంటూ కంపెనీలు తమ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. అయితే ఇంతకీ అసలు గ్లూటెన్ అంటే ఏమిటి ? ఇది ఎందులో ఉంటుంది ? ఇది ఉన్న ఆహారాలను తినడం వల్ల మనకు ఏవైనా దుష్పరిణామాలు ఎదురవుతాయా ? మనం కొనే ఫుడ్ ఐటమ్స్‌లో..కాస్ట్ ఎంత ఉంటుంది కాదు. వాటిని ఇన్‌గ్రీడియంట్స్ ఏం ఏం ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయో చూసుకోవాలి..!

గోధుమలు, రై, బార్లీ వంటి ధాన్యాల్లో గ్లూటెన్ ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్ జాతికి చెందిన పదార్థం. ఇందులో మళ్లీ రెండు ప్రోటీన్లు ఉంటాయి. వాటిని glutenin , gliadin అని పిలుస్తారు. అయితే గ్లూటెన్‌లో ఉండే గ్లియాడిన్ అనేది మనకు మంచిది కాదు.. మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకనే గ్లూటెన్ లేకుండా ఆహారాలను తయారు చేసి కంపెనీలు మనకు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీల ఉత్పత్తుల ప్యాకింగ్‌పై మనం గ్లూటెన్ ఫ్రీ అని ముద్రించి ఉండడాన్ని గమనించవచ్చు.
నిజానికి గ్లూటెన్ ఉండడం వల్ల పిండి నీటితో కలిసినప్పుడు సాగుతుంది. ఎలస్టిక్‌లా మారుతుంది. ఈ క్రమంలోనే ఆ పిండితో చపాతీలు, పరోటాలు ఇతర పదార్థాలను చేసుకుంటాం.. ఇక గ్లూటెన్ ఉన్న పిండిని వాడితేనే బేకరీ పదార్థాలు సరిగ్గా తయారవుతాయి. అయితే గ్లూటెన్ ఉన్న ఆహారాలను తినకూడదని ఆరోగ్య నిపుణుల వాదన..
గ్లూటెన్ ఉన్న ఆహారాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని పలువురు వైద్య నిపుణులు చెబుతుంటారు. దీని వల్ల గ్యాస్, అసిడిటీ, డయేరియా, మలబద్దకం, కడుపు నొప్పి, తలనొప్పి, అలసట, చర్మ సమస్యలు, డిప్రెషన్, సడెన్‌గా అధిక బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతారు. కానీ కొందరు మాత్రం అలాంటేదేమీ లేదని, గ్లూటెన్ ఉన్న పదార్థాలను తినవచ్చని అంటారు..
అయితే.. మీరు పైన చెప్పిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు మీకు ఈ సమస్యలు ఉంటే.. వాటిని తినకపోవడమే మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు, లక్షణాలు కనిపించకపోతే ఈ విషయం పట్ల అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.!
