ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్న ఆది పినిశెట్టి..?

-

విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు, తమిళ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి ఒక హీరోయిన్ తో ప్రేమ అనే నడుపుతున్నాడని గత కొన్ని రోజులుగా అనేక కథనాలు వెల్లువెత్తుతున్నాయి. హీరోయిన్ నిక్కీ గ‌ల్రానితో అతను ప్రేమాయణం నడుపుతున్నాడని… 2017వ సంవత్సరంలో మరకతమణి సినిమాలో నటించే సమయంలో వీరిద్దరికీ స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారిందని నివేదికలు చెబుతున్నాయి.

adhi pinisetti

తాజాగా ఆది పినిశెట్టి తండ్రి అయిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగాయి. అయితే ఈ కుటుంబ పార్టీలో కూడా నిక్కీ గ‌ల్రాని దర్శనమిచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్ షిప్ ఉందన్న వాదనకు బలం చేకూరింది. అయితే ఈ రూమర్లపై ఆది పినిశెట్టి ఇంకా పెదవి విప్పలేదు. అతి త్వరలోనే నిక్కీ గ‌ల్రానితో తన రిలేషన్షిప్ ని ఆది పినిశెట్టి అధికారికంగా ప్రకటిస్తాడని తమిళ వర్గాలు తెలుపుతున్నాయి. మరి ఆది పినిశెట్టి ఎంత త్వరగా ఈ తీపికబురును వెల్లడిస్తాడో చూడాలిక.

Read more RELATED
Recommended to you

Exit mobile version