‘మేజర్’ ఫంక్షన్‌కు యంగ్ యాంకర్ కావాలి..సుమపై అడివి శేష్ పంచ్‌లు..

-

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ కృష్ణ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ ‌కు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ పిక్చర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇందులో అడివి శేష్ పాత్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ పిక్చర్ లో సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించారు. ఈ పిక్చర్ ప్రమోషన్స్ లో అడివి శేష్ ప్రజెంట్ చాలా బిజీగా ఉన్నాడు. గత వారం ప్రమోషన్స్ లో భాగంగా ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. లేటెస్ట్ గా ‘క్యాష్’ ప్రోగ్రామ్ లో డైరెక్టర్ శశి కిరణ్ తిక్క, అడివి శేష్, గీత, శ్రీ చరణ్ పాకాల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘మేజర్’ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే అడివి శేష్ తన సినిమా ఫంక్షన్‌కు యంగ్ యాంకర్ కావాలి పెద్దవాళ్లు పక్కకు తప్పుకోవాలని అంటూ సుమ పై పంచుల వర్షం కురిపించాడు. సదరు ప్రోమో ప్రజెంట్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తుంది. అడివి శేష్ ఇంకా ఏయే పంచులు వేశాడు? అనేది తెలుసుకోవాలంటే పూర్తి ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version