ఆ సంఘటన జరిగాక భయంతో రెండు నెలలు నిద్రపోలేదు.. హీరో నాని

-

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిత్ర ప్రమోషన్స్లో పాల్గొన్న ఈ హీరో షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన తనను ఎంతగానో భయపెట్టిందంటూ చెప్పుకోచ్చారు.

నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించిన చిత్రం దసరా. ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదలై గూస్ బుంప్స్ తెప్పించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్న ఈ హీరో షూటింగ్ సమయంలో ఒక సంఘటన గురించి చెప్పుకొస్తూ ఆ విషయం తనను చాలా భయపెట్టిందని తెలిపారు.

ఈ సినిమాలో ఓ సన్నివేశం నన్ను ఎంతగానో భయపెట్టింది.. దానివల్ల రెండు నెలలు సరిగ్గా నిద్రపోలేదు అంటూ చెప్పుకొచ్చారు నాని. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘డంపర్ ట్రక్ బోగ్గును తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. దీనిక సంబంధించిన సీన్‌లో నేను ఆ డంపర్ ట్రక్‌లో నుంచి కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి. దీని కోసం సింథటిక్ బొగ్గు రెడీ చేశారు. అది మొత్తం డస్ట్‌తో ఉంటుంది’ అన్నాడు. అలాగే ‘ఆ సీన్‌లో నేను ఆ డంపర్‌లో నుంచి క్రింద పడిపోయాను. సింథటిక్ కోల్స్ కింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్‌లో నేను గాలి పీల్చకుండా ఉండాలి. పీల్చితే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ జరిగిపోయిన చాలా రోజులపాటు నన్ను వెంటాడుతూనే వచ్చింది. డంప్‌లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి. అది గుర్తోచ్చినప్పుడల్లా లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఈ క్రమంలో తెలియకుండానే నేను శ్వాస ఆపడం చేస్తుండేవాడిని. దాని నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. దీనివల్ల రెండు నెలల పాటు సరిగా నిద్రపట్టలేదు’ అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version