ఇటీవల శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఓ సమావేశంలో మాట్లాడుతూ హిందీ ఇక జాతీయ భాష కాదని అన్నారు. KGF2 సక్సెస్ ను ప్రస్తావిస్తూ దర్శకులు ప్రశాంత్ నీల్, హీరో యశ్ ను ప్రశంసించారు. కాగా, కిచ్చా సుదీప్ వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కౌంటర్ ఇచ్చారు. ట్వి్ట్టర్ వేదికగా హిందీ జాతీయ భాషనే అని పేర్కొన్నారు. ఈ విషయమై నెట్టింట చర్చ జరుగుతున్నది.
‘సోదరా..మీ దృష్టిలో హిందీ జాతీయ భాష కానప్పుడు..మీ మాతృభాషలోని సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తు్న్నారు?..హిందీ మనందరి మాతృభాషని, జాతీయ భాషని, ఆ భాష అలాగే ఎల్లప్పుడూ ఉంటుంది. జనగణమన’ అని అజయ్ దేవగణ్ ట్వీట్ చేశారు.
అలా ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం షురూ అయింది. అజయ్ దేవగణ్ ట్వీట్ చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. హిందీ అనేది జాతీయ భాష కాదని, అసలు అటువంటి ప్రస్తావనే లేదని, మన దేశంలో 22 అధికారిక భాషలున్నాయని, అందులో ఒకటి హిందీ అని ఓ నెటిజన్ సూచించారు.
ఎక్కువ రాష్ట్రాల్లో హిందీ మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అయిపోతుందా? అని ప్రశ్నించారు. అలా మొత్తంగా బాలీవుడ్ వర్సెస్ శాండల్ వుడ్ అన్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతూనే ఉన్నారు. అజయ్ దేవగణ్ ట్వీట్ పై సుదీప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
https://twitter.com/ajaydevgn/status/1519264792992952320?s=20&t=inw7QU1p95GuBZ9LaXdk9Q
https://twitter.com/SujithR11780782/status/1519266544408088577?s=20&t=inw7QU1p95GuBZ9LaXdk9Q
https://twitter.com/DasNandini97/status/1519272434419245057?s=20&t=inw7QU1p95GuBZ9LaXdk9Q