‘ఆచార్య’ పిక్చర్‌లో తండ్రీ తనయులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ హీరోలు, దర్శకుడు పాల్గొంటున్నారు. తాజాగా వీరిని డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేశారు.
కోకాపేటలోని ‘ధర్మస్థలి’ సెట్ లో వీరిని హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వచ్చిన ప్రశ్నల్లో బెస్ట్ వాటిని రామ్ చరణ్, చిరంజీవి, కొరటాల శివలను హరీశ్ శంకర్ అడిగారు. వారు వెంటనే సమాధానాలు చెప్పేశారు.
చిరంజీవి, రామ్ చరణ్ లను కొరటాల శివ ‘ఆచార్య’ కాకుండా నచ్చిన సినిమాలేంటని ప్రశ్నించారు హరీశ్. ఆ ప్రశ్నతకు చిరంజీవి ‘మిర్చి’ అని సమాధనాం చెప్పగా, రామ్ చరణ్ ‘మిర్చి, శ్రీమంతుడు’ అని చెప్పారు. ఈ క్రమంలోనే సరి కొత్త కాంబినేషన్ గురించిన ప్రస్తావన వచ్చింది.
చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని, అది ఎప్పుడు సాధ్యమవుతుందని హరీశ్ శంకర్ ప్రశ్నించారు. ‘ఆచార్య’తోనే ఆ కాంబినేషన్ కు నాంది పడిందని చిరంజీవి స్పష్టం చేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే ‘భవదీయుడు భగత్ సింగ్’లో అవకాశం ఉంటే తాను, రామ్ చరణ్ తప్పకుండా నటిస్తామని చిరంజీవి చెప్పుకొచ్చారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..