అజిత్‌ ‘వలిమై’ సినిమా థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి

-

కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ నటించిన తాజా మూవీ‘వలిమై’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీగానే అంచానాలు ఉన్నాయి. పొంగల్ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా దొపిడీ, క్రైమ్, రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు.

బాలీవుడ్ బ్యూటీ హ్యమా ఖురేషీ.. అజిత్ సరసన నటిస్తోంది. అయితే.. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ ఇవాళ థియేటర్లలో రిలీజ్‌ అయింది. అయితే.. అజిత్ సినిమా ఫస్ట్ డే చూసేందుకు థియేటర్లకు తరలివచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉండగా ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్ థియేటర్ ముందు పెట్రోల్ బాంబు దాడి చోటు చోటు చేసుకుంది. బైక్ పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ‘వలిమై’ మూవీ థియేటర్ ఎదుట బాంబు దాడి చేశారు. అక్కడే ఉన్న అభిమానులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు బైక్ పై పరారయ్యారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దుండగులను వెంటనే పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version