కత్తిలాంటి పిల్లతో పూరి కొడుకు రొమాన్స్

-

డైరక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తూ ఇప్పుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆంధ్రాపోరి సినిమా చేసిన ఆకాష్, పూరి డైరక్షన్ లో మెహబూబా సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అందుకే కొంతకాలం గ్యాప్ తో మళ్లీ ఆకాష్ కొత్త సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ టైటిల్ తో వస్తున్న ఆకాష్ ఈ సినిమాలో కేతికా శర్మతో రొమాన్స్ చేస్తున్నాడు.

పూరి కనెక్ట్స్ లో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీల్ పాదూరి డైరక్షన్ చేస్తున్నాడు. ఫేస్ బుక్ లో చాలా ఫేమస్ అయిన కేతికా శర్మ తెలుగు సినిమాకు సెలెక్ట్ అవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఫేస్ బుక్ లో స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో కేతికా ఫాలోవర్స్ ఉంటారు. రొమాంటిక్ నిర్మాత ఛార్మి కేతికా శర్మ గురించి చెబుతూ ట్వీట్ చేసింది.

గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఆకాష్, కేతిక రొమాన్స్ పీక్స్ లో ఉంటుందట. ఈమధ్య కాలంలో యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు ఉంటేనే సినిమా నిలబడుతుంది. ఈ క్రమంలో రొమాంటిక్ సినిమాలో ఆకాష్, కేతికల మధ్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోతాయట. మరి ఈ సినిమా అయినా ఆకాష్, పూరిలకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version