అఖిల్ “ఏజెంట్” మూవీ టీజర్ ప్రోమో రిలీజ్

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. చాలా కాలం నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు.ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కొంత మేరకు సక్సెస్ అయింది. ఇందులో లవర్ బాయ్ గా అఖిల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా, సరైన హిట్ ఫిల్మ్ ‘ఏజెంట్’ రూపంలో రాబోతున్నదని అక్కినేని వారి అభిమానులు అంటున్నారు.

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరి అందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ పిక్చర్ లో మాలీవుడ్ (మలయాళ) మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం విశేషం. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.‘‘ఏజెంట్’’ ఫిల్మ్ కోసం అక్కినేని అఖిల్ బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ చేశారు. ఈ చిత్రంలో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని తెలుస్తోంది.అయితే తాజాగా ఏజెంట్ చిత్రం నుంచి టీజర్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. పూర్తి టీజర్ ఈనెల 15న విడుదల కానుంది అని తెలిపింది చిత్ర యూనిట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version