కేసీఆర్, హరీశ్ రావుల కేసు విచారణ వాయిదా..!

-

కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటన పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్, హరీశ్ రావు ఇతరుల అవినీతే కారణమని, దీనిపై కేసు పెట్టాలని భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి చేసిన ఫిర్యాదు పై విచారణ జరిపిన భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణకు కేసీఆర్, హరీశ్ రావులు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు కొట్టి వేయాలని కేసీఆర్, హరీశ్ రావు లు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. జిల్లా కోర్టుకు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేసారని పిటిషనర్లు కేసీఆర్, హరీశ్ రావుల తరపు న్యాయవాదుల వాదన వినిపించారు. ఈరోజు విచారణ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కోర్టులో వారిపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందాడని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈకేసు ఇప్పటికే కేసీఆర్, హరీశ్ రావుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version