ఈ పూల గురించి విన్నారా? వీటి వలన కలిగే లాభాలను చూస్తే ఆశ్చర్యపోతారు?

-

చాలా శాతం మందికి సదాబహార్ పువ్వులు గురించి తెలియదు. అయితే వీటిని చూస్తే మాత్రం వెంటనే కనిపెట్టవచ్చు. సహజంగా వీటిని ఎక్కువగా ఎవ్వరూ ఉపయోగించరు మరియు వీటిని పిచ్చి పువ్వులు అని పిలుస్తారు. కాకపోతే ఇది ఒక ఔషధ మొక్క. ఈ పువ్వులను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు మరియు ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాలలో ఈ మొక్కలు పెరుగుతాయి మరియు వాటి గురించి తెలియకపోవడం వలన ఎవ్వరూ ఉపయోగించరు. అయితే ఈ మొక్కలకి ఉండే పువ్వులు గులాబీ రంగు మరియు తెలుపు రంగులో ఉంటాయి.

 

ఈ సదాబహార్ మొక్కకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అనే చెప్పవచ్చు. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు ఈ పువ్వులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయం చేస్తాయి. ఈ పువ్వులలో ఉండే ఆరోగ్య గుణాలు జుట్టు పల్చబడకుండా మరియు తలపై ఉండే చర్మం దెబ్బతినకుండా ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా తల పై ఉండే చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి మొదలైన సమస్యలను చెక్ పెట్టాలంటే ఈ పువ్వులను తప్పకుండా ఉపయోగించవచ్చు.

ఈ పువ్వులను ఉపయోగించి నూనెను తయారు చేసుకోవడం వలన ప్రయోజనాలను ఎంతో సులభంగా పొందవచ్చు. ముందుగా ఈ పువ్వులను ఉపయోగించి కషాయాన్ని తీసుకోవాలి, ఇలా చేసిన తర్వాత వేడి నూనెను కలపాలి. ఈ విధంగా చేసి తలపై మర్ధనా చేసి ఉపయోగించడం వలన ఎన్నో లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా ఈ పువ్వులను ఉపయోగించి హెయిర్ మాస్క్ ను కూడా తయారు చేసుకోవచ్చు. సదాబహార్ పువ్వులు, తేనె, కలబంద కలిపి ఉపయోగించి గ్రైండ్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఈ విధంగా హెయిర్ మాస్క్ వేసుకొని తర్వాత షాంపూ తో వాష్ చేసుకోవడం వలన ఎంతో మార్పుని గమనించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version