ప్రధాని మోదీ దెబ్బ- మాల్దీవ్స్ అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం!

-

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలకు మాల్దీవ్స్ వ్యవహారం చూస్తే తెలిసివస్తోంది. మోదీ ఒక్క ట్వీట్ ఆ దేశాధ్యక్షుడి పీఠాన్నే కదిలిస్తోంది. ఆ దేశ ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటి దురుసుతో ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడి పదవికే ఎసరొచ్చింది. ఇప్పటికే మాల్దీవ్స్ వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోగా, పర్యాటక ఆదాయం తగ్గుతోందని ఆ దేశం గగ్గోలు పెడుతోంది.

బాయ్‌కాట్‌ మాల్దీవ్స్ నినాదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న వేళ ఆ దేశ అధికార, ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా తమ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ కోరారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు.  అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జును అధికారం నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news