నేను అక్కినేని వారసుడిగా పని చేయను – అఖిల్

-

అక్కినేని అఖిల్ మరియు సాక్షి వైద్య జంటగా నటిస్తున్న చిత్రం “ఏజెంట్”.. ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని పోస్టర్ లు టీజర్ లను చూస్తేనే అర్ధమవుతోంది. కిక్ మరియు రేస్ గుర్రం లాంటి చిత్రాలను అందించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

అంతే కాకుండా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించడంతో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది.  ఇది ఇలా ఉండగా, ఏజెంట్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హీరో అఖిల్ తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను అక్కినేని వారసుడిగా పని చేయను.. నేను అఖిల్‌గా ముందుకెళ్తా. అక్కినేని పేరు ఉంటే.. ఒకే తరహాలో సినిమాలు చేయాలి. వారసత్వం అనేది నాపై బర్డన్‌గా ఉంటుంది. ప్రజలు నన్ను అఖిల్‌గానే ఓన్ చేసుకోవాలి. దాని కోసమే నేను ప్రయత్నిస్తూ ఉన్నా’ అని అఖిల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version