మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించిన ఏడాది.. 2022 : డబ్ల్యూఎంఓ

-

2022 సంవత్సరం మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించిన సంవత్సరమని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది. యూఎన్‌ నేతృత్వంలో ‘స్టేట్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌ క్లైమెట్‌ 2022’ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. లానినా పరిస్థితులున్నప్పటికీ ఇది ‘అయిదో లేదా ఆరో’ వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించిందని తెలిపింది. గతేడాది తీవ్ర వరదలు, రికార్డు స్థాయి వేడి గాలులు, కరవు పరిస్థితుల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించిందని వెల్లడించింది.

సముద్ర జలాల వేడి, ఆమ్లత్వ స్థాయిలు రికార్డు స్థాయిలో పెరిగాయని.. అంటార్కిటిక్‌ సముద్ర మంచు, యూరోపియన్‌ ఆల్ప్స్‌ హిమానీనాదాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణంలోని మూడు ప్రధాన గ్రీన్‌హౌస్‌ వాయువులు కార్బన్‌ డయాక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ 2021లో రికార్డు స్థాయిని తాకడం ఈ ప్రతికూల పరిస్థితులకు కారణమని పేర్కొంది.

2022 వేసవిలో భారత్‌, పాకిస్థాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. ఈ రెండు నెలలు జాతీయ సగటు ఉష్ణోగ్రతలు.. దీర్ఘకాలిక సగటు కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉన్నాయని డబ్ల్యూఎంవో పేర్కొంది. భారత్‌లో విపరీతమైన వేడిమి కారణంగా ధాన్యం దిగుబడులు తగ్గిపోగా, ఉత్తరాఖండ్‌ అటవీ ప్రాంతంలో అనేక చోట్ల కార్చిచ్చులు రేగాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version