అఖిల్ ఏజెంట్ ట్విట్టర్ టాక్.. హిట్ కొట్టాడా..?

-

అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్.. ఈరోజు ఓవర్సీస్ లో ఈ సినిమా విడుదల అవ్వగా.. మరి అక్కడి ఆడియన్స్ టాక్ ఎలా ఉంది..? అఖిల్ మొదటి విజయం అందుకున్నాడా?మళ్ళీ బోల్తా పడ్డాడా? అనేది ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ లో తెలుసుకుందాం..

కిక్ ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సాక్షి వైద్య హీరోయిన్గా, అఖిల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్.. ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రా ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమా ఇది అని తెలుస్తోంది. రా ఆఫీసర్ మమ్ముట్టి ఒక మాఫియా ముఠాను పట్టుకోవడంలో విఫలం అవుతాడు. వాళ్లని పట్టుకోవడం మన వల్ల కాదు.. కొంటె ప్రవర్తన కలిగిన అఖిల్ అయితే బెటర్ అని.. అలాంటి వాడే ఇలాంటి పెద్దపెద్ద క్రిమినల్స్ ను పట్టుకుంటాడని ఆపరేషన్ ఏజెంట్ ని అఖిల్ కి అప్పగిస్తారు. దీంతో అఖిల్ తన కొంటెతనంతో, అల్లరితో వారిని ఎలా పట్టుకున్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని సమాచారం.

ఇకపోతే ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి వస్తున్న ట్విట్టర్ రివ్యూ ప్రకారం ఏజెంట్ సినిమాతో అఖిల్ మళ్ళీ బోల్తాపడ్డాడని తెలుస్తోంది. అఖిల్ కి మరో డిజాస్టర్ తప్పదని అంటున్నారు.. ఇందులో అఖిల్ యాక్షన్ పరంగా మెప్పించాడు.. కానీ నటనతో ఆకట్టుకోలేక పోయాడు అని.. ఫస్ట్ భాగం పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ మరింత దారుణంగా ఉంది అంటూ చెబుతున్నారు. స్టోరీ చెత్తగా ఉందని.. కథనం చాలా స్లోగా సాగుతుందని.. వీ ఎఫ్ ఎక్స్ క్వాలిటీ లేదని సిల్లీ క్లైమాక్స్ అని చెబుతున్నారు. మొత్తానికైతే అఖిల్ మళ్ళీ బోల్తా పడ్డాడని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news