మారకుంటే మార్చేస్తా.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

-

రాష్ట్రంలో కొందరు brs ఎమ్మెల్యేల పని తీరు సక్రమంగా లేదని.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని అలాంటి వాళ్లంతా వారి తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా దళితబంధు పథకం అమలు అంశంపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత పార్టీ ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించారు. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి హెచ్చరిక అని చెప్పిన ముఖ్యమంత్రి… ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తప్పిస్తామని గట్టిగా హెచ్చరించారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు. రెండు పడకల గదుల ఇళ్ల విషయంలోనూ ఆరోపణలున్నాయని గుర్తుచేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిలకు ఈ సందర్భంగా సున్నిత హెచ్చరికలు జారీచేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా… పార్టీ కోసం కలిసి పని చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news