వైద్యుల పర్యవేక్షణలో అక్షయ్ “బెల్​బాటమ్” షూటింగ్..!

-

లండన్​లో​ చిత్రీకరణ పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో ‘బెల్​బాటమ్’​ చిత్రానికి అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్​. ఆగస్టు నుంచి షూటింగ్​ ప్రారంభం కానుంది. చిత్రీకరణ సమయంలో వైద్యులను కూడా అందుబాటులో ఉంచుకోనున్నట్లు వెల్లడించారు. చాలా కాలం తర్వాత మళ్లీ సెట్​లో అడుగుపెట్టబోతుండటం ఆనందంగా ఉందని వెల్లడించారు. కరోనాతో దాదాపు నాలుగు నెలలపాటు నిలిచిపోయిన చిత్రీకరణలు, ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. అయితే తాజాగా బాలీవుడ్​ హీరో అక్షయ్​కుమార్​ నటిస్తోన్న చిత్రం ‘బెల్​బాటమ్’​ చిత్రీకరణను తిరిగి ప్రారంభమించడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది చిత్రబృందం. ఆగస్టులో షూటింగ్​కోసం లండన్​ వెళ్లనుంది. ఇందుకోసం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు అక్షయ్.

akshay

సెట్​లో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వైద్యబృందాన్ని కూడా అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. శానిటైజర్లు, మాస్కులు, ఫేస్​ షీల్డులు, థర్మల్​ స్కీనింగ్​ సహా పలు జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారు బాలీవుడ్​ ఖిలాడీ. గతేడాది వచ్చిన కన్నడ ‘బెల్​బాటమ్’కు రీమేక్​ ఈ సినిమా. మాతృకలో రిషబ్​ శెట్టి, హరిప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 1980లో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కథానాయకుడు అక్షయ్​ డిటెక్టివ్​గా కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version