Selfie Trailer : సెల్ఫీ ట్రైలర్ రిలీజ్..మక్కీకి మక్కీ దింపేశారుగా..!

-

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ కు రీమేక్ గా తెరకెక్కింది. సెలబ్రెటీ పాత్రలో అక్షయ్‌ నటించగా.. పోలీస్‌ పాత్రను ఇమ్రాన్‌ హష్మీ పోషిస్తున్నాడు.

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవటానికి వచ్చిన ఒక స్టార్ హీరోకు, అతని ఫ్యాన్ అయిన ట్రాఫిక్ పోలీస్ కు మధ్య జరిగే ఈగో వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ ను గమనిస్తే ఒరిజినల్ వెర్షన్ ను మక్కీకి మక్కీకి కాపీ పేస్టు చేసినట్లుంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేని అక్షయ్ కు ఈ సినిమా అయినా హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

రాజ్ మెహతా డైరెక్షన్ లో కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నుష్రత్‌ భరూచా, డయానా పెంటీ హీరోయిన్‌లుగా నటించారు.  ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదల కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version