ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఓ కార్యక్రమంలో హాజరయ్యారు. అందులో భాగంగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఆలీపై దుర్భాషలాడాడు. దీంతో ఈ వీడియోను ప్రతి ఒక్కరూ వైరల్ చేస్తున్నారు. సీనియర్ నటుడు అయి ఉండి ఇలా ఇష్టం వచ్చినట్టు బండ బూతులు మాట్లాడటం ఏంటని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలపై ఆలీ స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేసుకున్నారు.

డైరెక్టర్ కృష్ణ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా మేమందరం పాల్గొన్నామని చెప్పారు. ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఓ మాట తూలింది. ఆయన నన్ను సరదాగా అన్న మాటను చాలా మంది వైరల్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. అతను చాలా పెద్దమనిషి గొప్ప ఆర్టిస్ట్. రీసెంట్ గా అతని కూతురు చనిపోవడంతో చాలా బాధతో ఉన్నాడు పుట్టడు దుఃఖంలో మునిగిపోయాడు. అలాంటి పెద్దాయనను పట్టుకొని మీరు ఇలా ట్రోల్ చేయడం సరికాదు అంటూ ఆలీ ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.