మాజీ మంత్రి రోజాపై రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

-

Rajendra Prasad on former minister Roja:  టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి మాజీ మంత్రి రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. రోజాపై ప్రముఖ సీనియర్ నటుడు నట కిరీటి రాజేంద్రప్రసాద్ సంచలన కామెంట్లు చేశారు. రీసెంట్ గా దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ టాలీవుడ్ హాస్యనటుడు అలీపై హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అతను మాట్లాడుతున్న సమయంలో రోజా వచ్చారు. వెంటనే రోజాని చూసిన రాజేంద్రప్రసాద్ హాయ్ హలో ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించారు.

Rajendra Prasad controversial comments on former minister Roja
Rajendra Prasad controversial comments on former minister Roja

ఆ తర్వాత దాన్ని కూడా నేనే హీరోయిన్ ను చేశాను అంటూ సంచలన కామెంట్లు చేశారు. దీంతో రోజా కాస్త సీరియస్ అయినట్లుగా వీడియోలో చూస్తే అర్థమవుతోంది. సీనియర్ నటి, మాజీ మంత్రిని పట్టుకొని అలా మాట్లాడడమేంటని కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆడవారిని దాన్ని అని అందరి ముందు అనడం సరికాదని మండిపడుతున్నారు. వయసు పెరిగితే సరిపోతుందా కొంచమైనా బుద్ధి పెరగాలి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు. అదే ఈవెంట్ లో ఆలిపై కూడా మీరు అసహ్యంగా మాట్లాడారని సీరియస్ అవుతున్నారు. వెంటనే నటుడు ఆలీకి, రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాజేంద్రప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news