Allari Naresh : ‘బచ్చలమల్లి’ టైటిల్ తో వచ్చేస్తున్న అల్లరి నరేశ్ !

-

సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు ‘అల్లరి’ నరేశ్. ‘అల్లరి’ ఫిల్మ్ తోనే తన సినీ కెరీర్ స్టార్ట్ కాగా, అలా కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కొన్నాళ్ల పాటు అల్లరి నరేశ్ ఉండిపోయారు. అలా చిత్రాలు చేసుకుంటూ సక్సెస్ అందుకుని కొంత కాలం పాటు ముందుకెళ్లిన నరేశ్..ఒకానొక దశలో ఇక విజయం అనేది లేక సతమతమైపోయాడు.

Allari Naresh 63rd film titled BachchalaMalli

వరుస సినిమాలు బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్న క్రమంలో నరేశ్ తన పంథా మార్చుకున్నారు. ఇక ఇప్పుడు హీరో అల్లరి నరేష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే “ఉగ్రం”, “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” సినిమాలతో హిట్స్ కొట్టారు. తాజాగా డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NARESH63 నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ ను “బచ్చలమల్లి”గా ఫిక్స్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version