గజిని సీక్వల్ వస్తుందా..?

-

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీస్ లో గజిని ఒకటి. మురుగదాస్ డైరక్షన్ లో సూర్య హీరోగా వచ్చిన ఆ సినిమా 2005లో పెద్ద విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా గజిని అదరగొట్టేసింది. తెలుగులో సూర్యకు మంచి మార్కెట్ వచ్చేందుకు ఆ సినిమా ఎంతో సహకరించింది. ఇక ఆ సినిమా తర్వాత మురుగదాస్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతూనే ఉంది.

లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద గజిని 2 టైటిల్ రిజిస్టర్ చేశారట. గజిని సీక్వల్ గా గజిని 2 చేయాలని అల్లు అరవింద్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడట. మురుగదాస్ డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుందా లేక తెలుగు దర్శకుడితో అల్లు అరవింద్ ఈ ప్రయత్నం చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవెళ మురుగదాస్, సూర్య కలిసి గజిని సీక్వల్ చేస్తే వరకు మళ్లీ ఆ సినిమా మరో సంచలనంగా మారే అవకాశం ఉంది. మరి గీతా ఆర్ట్స్ ఆ సినిమాకు డైరెక్ట్ నిర్మాతగా ఉంటారా లేరా అన్నది చూడాలి. తమిళ గజినిని హిందిలో అల్లు అరవింద్ రీమేక్ చేశారు. మురుగదాస్ డైరెక్ట్ చేసిన హింది గజిని కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version