మహేష్ పై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్..!

-

సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరితో పాటుగా ఎన్.టి.ఆర్ కూడా కలిసి సరదాగా గడుపుతారు. ఈమధ్త మహేష్, చరణ్ తో బాగా క్లోజ్ గా ఉంటున్నాడు. ఇది చాలా మంచి పద్ధతి కూడా. అయితే సినిమాల ఫలితాల దగ్గరకు వచ్చే సరికి ఈ ఫ్రెండ్ షిప్ కాస్త దూరమవుతుంది. తనకు నచ్చిన సినిమాపై తన రెస్పాన్స్ అందించే మహేష్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు, రజినికాంత్ పేట, శనివారం రిలీజైన ఎఫ్-2 గురించి కూడా మెచ్చుకుంటూ కామెంట్ పెట్టాడు.

ఈ మూడు సినిమాలు స్వయంగా చూసి విష్ చేసిన మహేష్ శుక్రవారం రిలీజైన రాం చరణ్ వినయ విధేయ రామ సినిమా గురించి మాత్రం మాట్లాడలేదు. మహేష్ చూడక మాట్లాడలేదా లేక సినిమా ఎలాగు మంచి టాక్ రాలేదు కాబట్టి ప్రస్థావించలేదా తెలీదు. ఒకవేళ చూడలేదని అనుకుంటే మిగతా మూడు సినిమాలు చూసే టైం ఉన్న మహేష్ స్నేహితుడు సినిమా చూడకుండా ఎలా ఉంటాడని అంటున్నారు.

ఫైనల్ గా మహేష్ చేస్తున్న ఈ ట్వీట్స్ వల్ల సినిమా గురించి మాట్లాడని హీరో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంతా మహేష్ ని టార్గెట్ చేస్తున్నారు. మరి మహేష్ వివి ఆర్ మీద కూడా ఏదైనా ట్వీట్ చేస్తే బెటర్ లేదంటే మెగా ఫ్యాన్స్ టార్గెట్ లో మహేష్ కూడా చేరతాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version