టాలీవుడ్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అల వైకుంఠపురంలో. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఆగస్టు 15న కానుకగా ఈ రోజు రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ చూస్తే చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది.
టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో త్రివిక్రమ్ మేకింగ్ స్పష్టంగా కనపడింది. త్రివిక్రమ్ గత సినిమాల మాదిరిగానే టైటిల్‌తో మళ్లీ ఆసక్తి రేపాడు. మధ్యతరగతి యువకుడి పాత్రను రాసుకున్నట్లు తెలుస్తోంది. టీజర్ చివరిలో బన్నీ, మురళీశర్మ మధ్య చమత్కారమైన సంభాషణ వినోదభరితంగా ఉంది.
ఏంట్రో గ్యాప్ ఇచ్చావ్ అని మురళీశర్మ అంటే… లేదు వచ్చేసింది అని బన్నీ చెపుతాడు. హీరో లుక్ చూస్తుంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడని తెలుస్తోంది. ఎమోషన్‌కు బాగా ప్రయార్టీ ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో కావాల్సినంత తారాగణం ఉంది.
టబు, పూజా హెగ్డే, నివేదా పెతురాజ్, నవదీప్ మరియు సుశాంత్ నటించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో తెరపైకి రానుంది. ఈ విషయాన్ని కూడా వీడియో చివరన ప్రకటించారు.