అల్లు అర్జున్ అరెస్ట్..FIR కాపీ ఇదే !

-

హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది తెలంగాణ సర్కార్‌. హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన FIR కాపీ ఇప్పుడు బయటకు వచ్చింది. అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్‌ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు అల్లు అర్జున్‌ను తరలించనున్నారు పోలీసులు.

Allu arjun became serious about the police

కాగా, తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్‌. తన అరెస్ట్‌ పై క్వాష్‌ పిటిషన్‌ వేశారు అల్లు అర్జున్‌. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు విజ్ఙప్తి చేశారు. పోలీసులను అడిగి 2.30కి చెబుతానని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఇక ఈ విచారణ 2.30కి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version