ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు రిమాండ్ రిపోర్టును కూడా తయారు చేస్తున్నారు. మరోవైపు సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై మధ్యాహ్నం 2.30 గంటల తరువాత విచారణ జరిగే అవకాశం ఉంది.
జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలం అయ్యారు..? అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్తుడిగా భావించి ఇలా చేయొద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. హైడ్రా వల్ల చనిపోయిన వారి కేసులో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ట్వీట్ చేశారు కేటీఆర్.