ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు అల్లు అర్జున్ ప్రస్తుతం తన పేరు మీద ఆయన ఒక పెద్ద మల్టీప్లెక్స్ నిర్మించే పనిలో భాగస్వామిగా నిలిచారు.. ఏ స్టార్ హీరో అయినా సరే ఒక వైపు సినిమాలు మరొకవైపు బిజినెస్ పైన దృష్టి పెడితేనే భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు ముఖ్యంగా పూర్వకాలంలో వారు ఎక్కువగా భూములపైన ఇన్వెస్ట్ చేసేవారు కానీ నేటితరం హీరోలు మాత్రం ఎక్కువగా రెస్టారెంట్లు మల్టీప్లెక్స్లు అంటూ కాలానికి తగ్గట్టు వేటికి డిమాండ్ ఉందో వాటిపైనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు.
ఇప్పటికే మహేష్ బాబు కూడా పలు క్లాత్ స్టోర్స్ రెస్టారెంట్లు మల్టీప్లెక్స్ లో అంటూ భారీగా డబ్బు వెనకేసుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఆ లిస్టులోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు.. ప్రస్తుతం ఏషియన్ సంస్థల అధినేత సునీల్ నారంగ్ గతంలో మహేష్ బాబు భాగస్వామ్యంతో ఏ ఎం బి అనే మల్టీప్లెక్స్ నిర్మించారు ఆ మల్టీప్లెక్స్ ఇప్పుడు హైదరాబాదులో వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచింది అయితే ఇప్పుడు అదే సంస్థ అల్లుఅర్జున్తో కలిసి హైదరాబాద్ అమీర్పేటలో సత్యం థియేటర్ని తీసుకొని AAA మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
AAA అనగా ఏషియన్ అల్లు అర్జున్ దీనికి సంబంధించి పని దాదాపు పూర్తయింది మరో నాలుగు నెలల్లో ఈ మల్టీప్లెక్స్ ను ఓపెన్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఇకపోతే ఈ థియేటర్ కి చాలా ప్రత్యేకతలు ఉండేలా యాజమాన్యం చూసుకుంటున్నారట ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ వర్చువల్ ఇమేజ్ ని ఏర్పాటు చేయనుండడం విశేషం. ఇప్పటివరకు ఏ స్టార్ హీరోకి కూడా ఇలా థియేటర్లో వర్చువల్ ఇమేజ్ లేదు ఒకవేళ ఇదే గనుక జరిగితే ఆ గణిత సాధించిన తొలి హీరోగా అల్లు అర్జున్ నిలవనున్నాడు. దీని ముందు నుంచొని ఎవరు ఎలా చేస్తే అలా రియాక్ట్ అవుతుందని సమాచారం.