Pushpa: టాలీవుడ్ కి లీకుల బెడద.. “పుష్ప’ డ్యాన్స్ వీడియో లీక్..!

-

Pushpa: టాలీవుల్ మరోసారి లీక్స్ కలకలం రేపుతోంది. ఇప్పటికే నిర్మాణంలో మహేష్ బాబు న‌టిస్తున్న సర్కారు వారి పాట చిత్రాల కంటెట్‌ ఆన్‌లైన్‌లో లీక్ అయిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఎంత సీరియ‌స్ అయినా.. లీక్ రాయులు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ డ్రామా ”పుష్ప. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుదలకు సిద్దం కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మధ్య కాలంలో పెద్ద సినిమాల షూటింగ్ పిక్స్ లీక్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న పుష్ప సాంగ్ వీడియో లీక్ అయ్యింది.ప్ర‌స్తుతం చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ మాస్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాట షూటింగ్ కోసం 1000 మంది డాన్సర్స్ పాల్గొంటున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇప్పుడు షూటింగ్ స్పాట్ నుండి బన్నీ డ్యాన్స్ చేస్తున్న కొన్ని వీడియోలు ఆన్ లైన్ లో ద‌ర్శ‌మించాయి.

ఓ ఆకాతాయి.. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ”వెయిటింగ్ పుష్ప మావా.. హే బిడ్డా ఇది నా అడ్డా” అని ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ‘పుష్ప’ కు మొదటి నుంచీ ఈ లీకుల బెడద ఉంటూనే ఉంది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వెర్షన్ తో పాటుగా ఓ ఫైట్ సీన్ మరియు కాకినాడ పోర్టులో షూటింగ్ కు సంబంధించిన ఫుటేజ్ ఆ మధ్య బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “పుష్ప” మూవీ.. రెండు భాగాలుగా విడుద‌ల కానున్న‌ది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఇందులో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా బ‌న్నీ క‌నిపించ‌నున్నారు. రష్మిక మందన్నా, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version