తన అరెస్ట్‌ పై అల్లు అర్జున్‌ సంచలన కామెంట్స్‌…ఇది దురదృష్టం!

-

Allu Arjun sensational comments on his arrest: తన అరెస్ట్‌ పై హీరో అల్లు అర్జున్‌ సంచలన కామెంట్స్‌ చేశారు.  గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసారు. ఈ తరుణంలోనే… మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్‌. రేవతి కుటుంబానికి మరోసారి తన సంతాపం తెలిపారు అల్లు అర్జున్. అది అనుకోకుండా జరిగిన సంఘటన అన్నారు.

Allu Arjun sensational comments on his arrest

నేను బాగానే ఉన్నా.. ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు.. కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడ లేను అంటూ ప్రకటించారు అల్లు అర్జున్. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు చెప్పారు.. రేవతి కుటుంబానికి నా సాను భూతి అంటూ మరోసారి వెల్లడించారు.. జరిగిన ఘటన దురదృష్టకరం.. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అన్నారు అల్లు అర్జున్‌.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news