Guvvala Balaraju Joins In BJP Party: BRS అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో BRS అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..బీజేపీలో చేరారు.

ఈ సందర్బంగా గువ్వలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచందర్ రావు. BRS అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..బీజేపీలో చేరిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడారు. బీజేపీకి తెలంగాణ గేట్ వే ఆఫ్ ఇండియాగా మారబోతోందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని గుర్తించి గువ్వల బాలరాజు పార్టీలో చేరారన్నారు రామచందర్ రావు.