అల్లు అర్జున్ పర్యటన వివాదం…ఇద్దరు కానిస్టేబుళ్ళపై వేటు

-

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్ళపై వేటు పడింది. ఎస్.బి. కానిస్టేబుళ్లు స్వామి నాయక్ , నాగరాజు విఆర్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఈ నెల 11న ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి వచ్చారు అల్లు అర్జున్.

Allu Arjun’s visit controversy two constables are in trouble

ఈ తరుణంలోనే… భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని అందివ్వలేదని కానిస్టేబుళ్లపై లపై చర్యలు తీసుకున్నారు అధికారులు. ఈ సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డి.ఎస్.పి రవీందర్ రెడ్డి,.టూ టౌన్ సీఐ రాజారెడ్డి లకు నోటీసులను జారీ చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్… ఇద్దరు కానిస్టేబుళ్ళపై వేటు వేసింది. ఇక అటు అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదం మెగా కుటుంబంలో కూడా చిచ్చు రాజేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news