తెలంగాణలో కొత్తగా BRU కాఫీ టాక్స్ మొదలైందని రేవంత్‌రెడ్డి సర్కార్ కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. B – భట్టి విక్రమార్క టాక్స్, R – రేవంత్ రెడ్డి టాక్స్, U – ఉత్తమ్ కుమార్ రెడ్డి టాక్స్ వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వారిని ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడమే టార్గెట్ గా పెట్టుకుందని విమర్శించారు.
వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తడిసిన ధాన్యంను కొనుగోలు చేయాలి, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ స్థానంను నిలబెట్టుకుంటామని కేటీఆర్ అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీస్థానాన్ని గెలిచాం. ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు.