గ్రాండ్ గా అమీ జాక్సన్‌ వివాహ వేడుక.. ఫొటోలు వైరల్

-

‘ఎవడు’, ‘ఐ’, ‘ రోబో -2. ఓ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది అమీ జాక్సన్‌. ఈ భామ తెలుగు, హిందీ, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ తాజాగా హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ను పెళ్లాడింది. ఇటలీలో ఘనంగా జరిగిన వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది..’ అంటూ ఈ గుడ్ న్యూస్ను షేర్ చేసుకుంది.

అయితే అమీ జాక్సన్ వెస్ట్విక్ కంటే ముందు జార్జ్ పనియోటౌ అనే బిజినెస్మెన్తో రిలేషన్షిప్లో ఉండేది. కొంతకాలం పాటు లివిన్లో ఉన్న ఈ జంటకు ఆండ్రూ అనే బాబు జన్మించాడు. అయితే ఈ జంట 2020లో పెళ్లి చేసుకోవాలనుకోగా కరోనాతో పోస్టుపోన్ అయింది. ఆ తర్వాత మనస్పర్థల వల్ల ఈ జంట విడిపోయినట్లు సమాచారం. ఇక సౌదీ అరేబియాలో ఓ ఫిలిం ఫెస్టివల్లో ఎడ్ వెస్ట్విక్ను తొలిసారి కలిసిన అమీ కొంతకాలంతో తర్వాత అతడితో ప్రేమలో పడింది. తాజాగా పెళ్లి బంధంతో ఈ జంట ఒక్కటైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version