బుల్లితెరపై యాంకర్ అనసూయ ఎంతటి స్టార్ ఇమేజ్ ను సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొద్దిరోజులుగా ఈమె పలు ప్రాంతాలను తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తోంది. అలా తాజాగా అమెరికాలో తెలుగు వారి తానా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. న్యూయార్కులో టైమ్స్ క్యూర్ వద్ద బతుకమ్మ పండుగ కూడా చాలా వైభవంగా నిర్వహించారు తెలుగు ప్రజలు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా యాంకర్ అనసూయ అక్కడ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచింది . అనసూయతో పాటు సింగర్ మంగ్లీ కూడా ఉత్సవాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కూడా ఎంతో సాంప్రదాయమైన చీరలలో కనిపించారు.
ఇక మేయర్ తో కలిసి అనసూయ బతుకమ్మ పండుగ సంబరాలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది . మేయర్ తో చాలా సేపు మాట్లాడినట్లుగా కూడా సమాచారం. అంతేకాకుండా తనతో కలిసి దిగిన కొన్ని సెల్ఫీలను ఇటీవల తన ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేసింది అనసూయ. పుష్ప సినిమా సిగ్నేచర్ తో ఒక ఫోజులు ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా అనసూయ ఎమోషనల్ తో కూడిన ఒక పోస్ట్ చేయడం జరిగింది.
అనసూయ ఇలా రాసుకుంటూ.. ఎంతటి గౌరవప్రదమైన సంఘటనలతో కూడిన సమయం .. బతుకమ్మ పండుగ న్యూయార్క్ లో చేసుకోవడం ఈ విజయవంతమైన బంగారు బతుకమ్మ వేడుకలను తెలంగాణ ఆడపడుచులకు నిర్వచనం ఇది .. తాను చాలా గర్వంగా భావిస్తున్నానని తెలియజేసింది అనసూయ. ఇక ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసింది. ఇక తానాలో ఉండే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. ముఖ్యంగా అందమైన మహిళలందరికీ చాలా అద్భుతమైన సమయమిది అంటూ ఒక హార్ట్ ఎమోజితో అనసూయ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.