11 ఏళ్ల క్రితం అనసూయ… ఏమి తింటుంది?

-

ఈ మధ్యకాలంలో తెలుగు టీవీ యాంకర్స్ లో ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు… అనసూయ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! ఏ టీవీలో చూసినా అనసూయే.. ఏ షోలో చూసినా అనసూయే అన్న విధంగా దూసుకుపోతుంది ఆమె! ఓపక్క టీవీ షోలతో బిజీగా ఉంటూనే… రంగమ్మత్తగా వెండితెరపై కూడా అప్పుడప్పుడూ మెరుపు మెరిపిస్తుంది! అయితే… రోజుకో రకంగా తన అందంతో అలరించే అనసూయను… ప్రస్తుతం కరోనా పుణ్యమా అని కొత్త కొత్తగా చూసే అవకాశం లేదు! కరోనా కణిణికరిస్తే… మరో మూడు నాలుగు నెలల తర్వాతే అనసూయ పునః దర్శనం! ఈ క్రమంలో అనసూయ… తాను రేపు ఎలా కనిపిస్తాను అనే సంగతి అటుంచండి… మొన్న ఎలా ఉన్నానో చూడండి అనేలా సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది! దీనిపై కుర్రకారు తమ క్రియేటివిటీతో కామెంట్స్ చేస్తున్నారు!!


ప్రస్తుతం ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది త‌మ క్రియేటివిటీకి పదును పెడుతున్న సంఘటన్లు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులు రకరకలా వీడియోలతో సందడి చేస్తుంటే… సెలబ్రిటీలు మాత్రం తమ రోజువారీ పనులతో పాటు రకరకాల ఛాలెంజ్‌లు విసురుతూ ఫ్యాన్స్ కి ఆహ్లాదం పంచుతున్నారు. ఈ క్రమంలో యాంకర్ అనసూయ ఒక త్రోబేక్ పిక్చర్ ని షేర్ చేసింది. 11 ఏళ్ల క్రితం యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి పిక్ అది! ఆ పిక్ లో అనసూయ… ఓ న్యూస్ ఛానెల్‌ లో న్యూస్ చదువుతూ కనిపిస్తుంది. దీంతో అనసూయ అభిమానులు… అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు… నువ్వు తినేది అందమా.. అన్నమా? అన్న రేంజ్ లో రిప్లై లు పెట్టేస్తున్నారు! అనసూయకు ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది మరి!!

Read more RELATED
Recommended to you

Latest news