ఐలాండ్లో ఒంటరిగా ఇరుక్కుపోతే సుధీర్ తోడు కోరుకుంటా.. రష్మి బోల్డ్ కామెంట్స్..

-

జబర్దస్త్ కామెడీ షో తో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ రష్మీ సుడిగాలి సుదీర్ లో తమ కెరీర్లో దూసుకుపోతున్నారు. ఈ షోలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పాలి. నిజంగా తాము ప్రేమలోనే ఉన్నామంటూ అందరిని నమ్మించేశారు. ఒకరిని ఒకరు వదిలి ఉండలేము అనే అంతగా కెమిస్ట్రీ పండిస్తూ ప్రేమను వ్యక్తం చేస్తూ బుల్లితెరపై సందడి చేశారు. పలుషోల్లో డ్యూయెట్లు పాడుకుంటూ పెళ్లి పీటలు సైతం ఎక్కేసారు. తాజాగా సుధీర్ తన కెరీర్లో బిజీ అయిపోయి జబర్దస్త్ ను వదిలేయడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టే తెలుస్తోంది. అయితే తాజాగా రష్మీ ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మరోసారి సుధీర్ పై తన ప్రేమను వ్యక్తం చేశారు..

జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోయిన తర్వాత రష్మీ సుధీర్ విడిపోయినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికీ సుదీర్ పై తన ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తాజాగా జరిగిన ఒక సంఘటనతో నిరూపించేసింది రష్మీ. అసలు విషయం ఏంటంటే.. రష్మి.. స్టార్‌ మాలో ఓంకార్‌ హోస్ట్ గా చేస్తున్న `సిక్త్స్ సెన్స్` షోకి గెస్ట్ గా వెళ్లింది. నటుడు బ్రహ్మాజీతో కలిసి ఆమె సందడి చేసింది. రష్మి, బ్రహ్మాజీల మధ్య కామెడీ నవ్వులు పూయించింది. రష్మిని బ్రహ్మాజీ గోకడం హైలైట్‌గా నిలచింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పుష్ప లోని ఊ అంటావా మావ.. పాటకి స్టెప్పులేశారు. మాస్‌ బీట్‌కి, అంతే మాస్‌గా డాన్సులు చేసి అదరగొట్టారు. అనంతరం యాంకర్ ఓంకార్ రష్మిని చిక్కుల్లో పడేసే ప్రశ్న వేశాడు. నువ్వు ఒంటరిగా ఓ ఐలాండ్‌లో ఇరుక్కుపోతే, మీతో ఉండటానికి టాలీవుడ్‌లో ఏ హీరోని ఎక్స్ పెక్ట్ చేస్తారు` అని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు కాసేపు ఆలోచించిన రష్మీ తర్వాత కచ్చితంగా సుధీర్‌ కంపెనీగా ఉంటే చాలా బాగుంటుంది` అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. దీంతో రష్మి ఆన్సర్‌తో ఆ షోలో ఆడియెన్స్ గోలతో హోరెత్తించారు. ప్రస్తుతం రష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version