బెట్టింగ్ యాప్ కేసు.. హైకోర్టుకు యాంక‌ర్‌ శ్యామ‌ల‌

-

ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, సినిమా ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో పలువురు విచారణకు హాజరయ్యారు. కొందరేమో విచారణకు భయపడి దుబాయ్ వెళ్లినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న ప్రముఖ యాంకర్, నటి శ్యామల తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

సోషల్ మీడియా వేదికగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసినందు వల్ల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదైన విష‌యం తెలిసిందే. ‘Andhra365’ అనే బెట్టింగ్ యాప్‌ను శ్యామ‌ల ప్ర‌మోట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో ఇప్ప‌టికే యాంకర్‌ విష్ణుప్రియతో పాటు.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ రీతూ చౌదరీ, మరికొందరిని గురువారం రోజున విచారించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news